భూపాలపల్లి టౌన్, జూలై 17: పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన కాలేజీకి నేషనల్ మెడిక ల్ కౌన్సిల్ నుంచి అనుమతులు లభించాయి. సెప్టెంబర్ మొదటి వారంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్స రం తరగతులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవ నంలోనే క్లాసులు నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించి, విద్యార్థులు, అధ్యాపకులకు వసతి సౌకర్యం సైతం కల్పించారు. కాగా, 2014 జూన్ తర్వాత రాష్ట్రంలో నెలకొల్పిన మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మొత్తం సీట్లు తెలంగాణ బిడ్డలకే అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పారిశ్రామిక ప్రాంతంగా దినదినాభివృద్ధి చెందుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కళాశాలను మంజూరు చేయగా, నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అనుమతులు లభించాయి. ఈ ఏడాది (2023-24) ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి.
చివరి దశకు భవన నిర్మాణ పనులు
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ ఏ రియాలో సింగరేణి నూతన వెయ్యి క్వార్టర్స్ సమీ పం లో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మరో 20 రోజుల్లో సదరు కాంట్రాక్టర్ భవనాన్ని కళాశాలకు అప్పగించను న్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలోనే తరగతులు
నీట్ ఫలితాలు వెలువడడంతో వైద్య కళాశాలలో అడ్మిషన్ల ప్రక్రియ ఇక వేగవంతం కానుంది. జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రధాన ఆస్పత్రి భవనంలో మెడికల్ కళాశాల తరగతులను ప్రారంభిం చాలని నిర్ణయించుకున్నప్పటికీ నూతన కళాశాల భవ నంలోనే తరగతులు ప్రారంభించాలనే ప్రభుత్వ ఆదేశా ల మేరకు అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. ప్రిన్సిపాల్‌గా రాజు దేవ్డే, హెచ్ఓడీలుగా డాక్టర్ నాగార్జునరెడ్డి, డాక్ట ర్ వందనను ప్రభుత్వం నియమించింది. వీరు కళాశా ల తరగతుల ప్రారంభ ప్రక్రియను పర్యవేక్షిస్తు న్నారు.
ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది నియామకం
జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు, అసో సియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు బోధ నేతర సిబ్బంది నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఇప్పటికే దాదాపుగా పూర్తి చే సింది. కళాశాలలో మొత్తం మూడు డిపార్ట్మెంట్లలో (అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ) మొదటి సంవత్సరంలో ఒక్కో డిపార్ట్మెంట్కు ఒక ప్రొఫెసర్, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమవుతారు. వీరి నియామకాన్ని ప్ర భుత్వం పూర్తి చేసింది. అనాటమీ, ఫిజియోథెరపీ, బయో కెమిస్ట్రీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఫిజీషియన్, ఆర్థో, అనస్థిషియా, సైక్రియాటిస్టు తదితర విభాగాల్లో మొత్తం ఇప్పటి వరకు ప్రిన్సిపాల్‌తో కలిపి 24 మందిని నియమించింది. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి 100 సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆల్ఇండియా కోటా కింద 15 శాతం సీట్లను భర్తీ చేయనున్నారు. కన్వీనర్ కోటాలో ఇప్పటి వరకు ఇతర జిల్లాలకు చెందిన విద్యార్థులను భర్తీ చేయగా నూతనంగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు తెలంగాణ విద్యార్థులకు మాత్రమే సీట్లు దక్కనున్నాయి.
సింగరేణి సహకారంతో వసతులు
వైద్య కళాళాల విద్యార్థులు, అధ్యాపకుల వసతి సౌకర్యానికి సింగరేణి యాజమాన్యం సహకరిస్తోంది. మంజూర్‌నగర్ ఏరియాలో నూతనంగా నిర్మించిన సింగరేణి క్వార్టర్లలో విద్యార్థుల కోసం రెండు బ్లాక్‌లను కేటాయించారు. ఒక్కో బ్లాక్‌లో 14 క్వార్టర్లు ఉండగా రెండు బ్లాకుల్లో 28 క్వార్టర్లు విద్యార్థులకు కేటాయించా రు. అలాగే మరో 14 సింగరేణి క్వార్టర్లను అధ్యాపకుల కు కేటాయించినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.
అందుబాటులోకి కార్పొరేటు వైద్యం
మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైతే జిల్లా లో కార్పొరేటు స్థాయి వైద్యం అందుబాటులోకి రా నుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంలో 100 పడకల ఆస్ప త్రి ని 300 బెడ్స్‌కు అప్‌గ్రేడ్ చేశారు. మాతా శిశు సంర క్షణ కేంద్రం ద్వారా తల్లీ బిడ్డలకు పూర్తి స్థాయిలో వైద్యం అందుతోంది. మెడికల్ కళాశాల పక్కనే 50 పడ కల ఆయుష్ ఆస్పత్రి నిర్మాణ పనులు జరుగుతున్నా యి. 300 పడకల ఆస్పత్రి, సింగరేణి ఏరియా ఆస్ప త్రిని మెడికల్ కాలేజీ పరిధిలోకి తీసుకోనున్నారు. దీంతో జిల్లాలో అన్ని విభాగాల వైద్యం అందుబాటు లోకి రానుంది. దీంతోతో పాటు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.
సెప్టెంబర్‌తో తరగతులు..; రాజు దేవ్డే, ప్రిన్సిపాల్
మొదటి సంవత్సరం వైద్య విద్య తరగతులను సెప్టెంబర్‌లో ప్రారంభించ డానికి ఏర్పాట్లు చేస్తు న్నాం. నూతన మెడికల్ కళాశాల భవన నిర్మాణ ప నులు చివరి దశకు చేరుకు న్నాయి. 20 రోజుల్లో భవనాన్ని మాకు అప్పగిస్తా మన్నారు. అందులోనే తరగతులు ప్రారంభి స్తాం. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు, అధ్యాపకులకు వసతి సౌకర్యం కల్పించాం. జిల్లా ప్రధాన ఆసుపత్రి, సింగరేణి హాస్పిటల్ మెడికల్ కళాశాలకు అనుసంధానంగా పనిచేయనున్నాయి.