నమస్తే నెట్వర్క్, మే 1 : మే డే వేడుకలను బల్దియా ఆవరణలో ఘనంగా నిర్వహించారు. సీపీఎం నాయకుడు సింగారపు బాబు ఎర్ర జెండాను ఎగురవేశారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆటో అడ్డాలో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతాపరుద్ర ఆటో యూనియన్ ముఖ్య సలహాదారుడు బొక్క స్వామి, అధ్యక్షుడు మొట్ల నర్సింగరావు, జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్ పాల్గొని అన్నదానం చేశారు. కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దువ్వ కనుకరాజు, వివేకానంద గృహ నిర్మాణ కార్మిక సంఘం పట్టణాధ్యక్షుడు రాజయ్య,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తేలు సారంగపాణి, వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జి ఇమ్మడి బాబు పాల్గొన్నారు. పరకాల పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు ఎంజాల రాజు ఎర్ర జెండా ఎగరవేశారు. ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో సీఐటీయూ యాక్ గ్రానైట్ యూనియన్ అధ్యక్షుడు పెంతల రవీందర్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేశ్, ఆత్మకూరులో విఘేశ్వర భవన నిర్మాణ తాపీమేస్త్రీల సంఘం మండలాధ్యక్షుడు మంద రవి తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా : కార్మికుల దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ భవన్ కుమార్‌పల్లి పెయింటర్స్ అడ్డా వద్ద పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత తాటి సత్యనారాయణ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఎర్రోజు భాస్కర్, కోశాధికారి కర్నాల శ్రీను, వాసు, శ్రమశక్తి అవార్డుగ్రహీత కుసుమ శ్యామ్‌సుందర్, చాగంటి రమేశ్, అశోక్, ఖలీల్, ప్రకాశ్ పాల్గొన్నారు.
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని బుధవారం వరంగల్ జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వరంగల్ కొత్తవాడ 80 ఫీట్లరోడ్లో చేనేత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు చిప్ప వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మేడే జెండాను ఎగురవేసి, పండ్లు పంపిణీ చేశారు. బట్టలబజార్‌లో ఆల్‌షాప్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సీఐటీయూ కార్యదర్శి ముక్కెర రామస్వామి, దేశాయిపేటలో ట్యానరీ అండ్ లెదర్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కొత్తూరి యాకేందర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. నర్సంపేట మండలంలోని మహేశ్వరంలో ఇండస్ట్రీస్ సంఘాల అధ్యక్షులు జెండాలు ఎగురవేశారు. రాజుపేట ఏరియాలో హేమాత, హరికృష్ణ, శ్రీసాయి ఇండస్ట్రీస్‌లో హమాలీలు వేడుకలు నిర్వహించారు.
అలాగే, అన్ని ప్రాంతాల్లో కార్మిక జెండాలను ఆవిష్కరించారు. నెక్కొండలోని హైస్కూల్ కూడలిలో బూరుగుపల్లి లక్ష్మయ్య స్మారక స్తూపం ఎదుట సీపీఎం, ఏసీపీఐ, సీపీఐ నేతలు జెండాలు ఎగురవేసి నివాళులర్పించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట, చల్లా గోదాముల్లో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, సీపీఐ మండల కార్యదర్శి కందిక చెన్నకేశవులు ఆధ్వర్యంలో, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. వర్ధన్నపేటలో సీపీఎం, సీపీఐ, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల నాయకులు వేడుకలు నిర్వహించారు. మండలకేంద్రంలోని సివిల్ సప్లయ్ గోడౌన్ సముదాయంతోపాటు అంబేద్కర్ సెంటర్, ఇల్లంద వ్యవసాయ మార్కెట్‌యార్డు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద నాయకులు వేడుకలు నిర్వహించారు.
పట్టణంలో సీఐటీయూ రాష్ట్ర నాయకుడు తుమ్మల సాంబయ్య ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. హసన్‌పర్తిలో సీఐటీయూ మండల కార్యదర్శి పుల్ల అశోక్ ఆధ్వర్యంలో జెండా ఎగువేశారు. ఐనవోలు మండలంలోని ఐనవోలు, పున్నేల్, పంథిని, కక్కిరాలపల్లి, నందనం, రాంనగర్, రెడ్డిపాలెం, లింగామోరిగూడెం, ఉడుతగూడెం, గర్మిళ్లపల్లి, వెంకటాపురం, ముల్కలగూడెం, నర్సింహులగూడెం, కొండపర్తి, వనమాలకనపర్తిలో జెండాలను ఆవిష్కరించారు. నర్సంపేట పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు మేడే వేడుకలు నిర్వహించాయి. బీఆర్ఎటీయూ జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు పాల్గొన్నారు. చెన్నారావుపేటలో ఆటో యూనియన్ సభ్యులు, తాపీవర్కర్స్ యూనియన్, హమాలీ యూనియన్ల ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. కోనాపురం, అమీనాబాద్, లింగగిరి, పాపయ్యపేటలో మేడే వేడుకలు నిర్వహించారు.