హనుమకొండ, జూన్ 08:ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ మర్కజి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఆదివారం గుండ్ల సింగారం గ్రామంలో బడిబాట నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బడి ఈడు పిల్లల సర్వే నిర్వహించడంతోపాటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించారు. బాల బాలికలకు చదువు చెప్పే బాధ్యత తమదని తమ పాఠశాలకు పిల్లలను పంపించి వేలాది రూపాయల ఫీజులను ఆదా చేసుకోవాలని కోరారు.
పేద, మధ్యతరగతి పిల్లలకు విద్యాబోధన చేసే అవకాశం కల్పించాలని అన్నారు. తమ పాఠశాల ఫలితాలను ఈ సందర్భంగా తల్లిదండ్రులకు వివరించారు. విద్యార్థులకు చదువుతోపాటు అందిస్తున్న ఎన్సీసీ, ల్యాబ్, ఆటలు, వృత్తి విద్యా కోర్సులు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ బడిబాట కార్యక్రమంలో తెలుగు భాషో పాధ్యాయులు వలస పైడి తో పాటు ఉపాధ్యాయులు ఎడ్ల శ్రీనివాస్, ధూపాటి కిరణ్ కుమార్, డాక్టర్ తుపాకుల లింగమూర్తి పాల్గొన్నారు.