హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 12: దేశచరిత్రలో ఎందరో త్యాగధనులను అందించిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకుడు, రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మార్క శంకర్నారాయణ అన్నారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ 90 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏఐఎస్ఎఫ్ శ్వేత అరుణ పథకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా శంకర్నారాయణ మాట్లాడుతూ అలుపెరగని సమరశీల ఉద్యమాల వేదిక ఏఐఎస్ఎఫ్, స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమ వారసత్వంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరిగని పోరాటాలు నిర్వహిస్తున్న విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఊట్కూరి ప్రణీత్గౌడ్, భాషబోయిన సంతోష్, ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, కుక్కల కుమార్, జక్కుల భానుప్రసాద్, బొజ్జు జ్యోతి, కసరబోయిన రవితేజ, సిపతి వినయ్, కొయ్యడ కుశాల్, అభి, లక్ష్మణ్, నికిత వరలక్ష్మి అనుషతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.