సుబేదారి : మావోయిస్టు పార్టీ గొత్తికోయ ఏరియా సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కొసా ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్ వంజెం కేషా, అలియాస్ జెన్నీ వరంగల్ పోలీసు కమిషనర్ ముందు లొంగిపోయింది. ఈమేరకు శుక్రవారం హనుమకొండ లోని వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సీపీ అంబర్ కిషోర్ ఝా మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లా పామేడ్ మండలం రాసపల్లకి చెందిన వంజెం కేషా మావోయిస్టు పార్టీలో 2016లో పామేడ్ లోకల్ స్కాడ్ దళంలో చేరింది.
ఆ తర్వాత అబూజ్‌మాడ్‌కు బదిలీ అయింది. 2021లో మావోయిస్టు పార్టీ కేషాను గొత్తికోయ ఏరియా కమిటీ సభ్యురాలుగా నియమించింది. 2022లో ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యురాలుగా పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యుడు రమేష్‌ను వివాహం చేసుకుంది. 2024 ఏప్రిల్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ అలియాస్ కొసాకు ప్రొటెక్షన్ గ్రూప్ మహిళా కమాండర్‌గా పనిచేస్తున్నది. మావోయిస్టు పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత, అనారోగ్యం రీత్యా, తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునారాసవ పథకాలకు ఆకర్షితులై కేషా లొంగిపోయిందని సీపీ తెలిపారు. కోషాపై పలు నేరాల కేసులు ఉన్నట్లు సీపీ పేర్కొన్నారు.