హనుమకొండ, డిసెంబర్12 : రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు నచ్చి ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారని, ఇతర పార్టీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పంచాయత్‌రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల, రాయపర్తి మండలాలకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు సోమవారం హనుమకొండలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో బీఆర్ఎస్లో చేరగా, మంత్రి ఎర్రబెల్లి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్ను మరింత పటిష్టం చేసుకోవాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో అందరూ భాగస్వాములు కా వాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను అన్ని విధాలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. దేవరుప్పుల మండలంలో గౌడ సంఘం కోసం మినీ ఫంక్షన్‌హాల్ కావాలని గౌడ సంఘం అధ్యక్షు డు కారుపోతుల ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతి పత్రం అందజేయగా, వెంటనే స్పందించిన మంత్రి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా రాయపర్తి మండలం కాట్రపల్లిలో గౌడ కులస్తుల దైవం కాటమయ్య దేవాలయం నిర్మించాలని కోరగా… నిర్మాణానికి అన్ని వి ధాలా సాయం చేస్తానని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో దేవరుప్పల మండలం లకావత్‌తండా గ్రామ పంచాయతీ నుంచి లకావత్ రవి, శ్రీను, బబ్లూ, శ్రీనివాస్, దేవునిగుట్టతండా నుంచి బానోత్ బన్సీ, వావిలాల్, రమేశ్, రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి గౌడ సంఘం అధ్యక్షుడు కోలుకొండ రాములు, గుండ్లపల్లి కిష్టయ్య, గుండ్లపల్లి యాకయ్య, గుండ్లపల్లి భాసర్, గుండ్లపల్లి మధు, గుండ్లపల్లి అశోక్, గుండ్లపల్లి సోమయ్య, గుండ్లపల్లి నారాయణ, ఐలయ్య యాదగిరి, రాజు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో దేవరుప్పుల మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్, పాలకుర్తి దేవస్థాన కమిటీ సభ్యుడు సత్తయ్య, గౌడ సంఘం నాయకులు ఆకుల అంజయ్య, గొడిశాల మల్లేశ్, యాద య్య, గొడిశాల నరసయ్య, గొడిశాల యాకయ్య, ఆకుల మల్లయ్య, దాట్ల యాకన్న ,అంబాల యాకన్న, కారుపోతుల అనిల్, బండి శ్రీహరి, ఎరుకల అశోక్, గోడిశాల దశరథ్, కాట్రపల్లి గ్రామ అధ్యక్షుడు మండల శ్రీధర్, సర్పంచ్ ఎల్లయ్య, గ్రామ కార్యదర్శి అన్వర్, నాయకులు ఎండీ గుంషావళి, రాంపెల్లి రాజా, గుమ్మడి రాజు, శ్రీను, చెనబోయిన యాకయ్య. కత్తి సోమన్న, సురేశ్ పాల్గొన్నారు.