నర్సంపేటరూరల్, సెప్టెంబర్ 3 : సుస్థిర పాలన బీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నర్సంపేట మండలం ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్ష్యంలో బీఆర్ఎస్ చేరారు. ముగ్ధుంపురం గ్రామానికి చెందిన ఆకులపెల్లి రవి, గొర్రె వీరస్వామి, అర్షం రాము, ఆకులపెల్లి విజేందర్, గడ్డం రాకేశ్, బరుపట్ల రవితేజ, బరుపట్ల ఎల్లస్వామి, ఆకులపెల్లి భాస్కర్, నాగరాజు, వెంకటేశ్, తరుణ్, అనిల్, సాంబయ్య, మహేశ్, ప్రభాకర్, అనిల్, సుధీర్, రాజు, సతీశ్, ప్రవీణ్, శ్రీకాంత్, కట్టస్వామి, బాబు, మహేందర్, రాజేందర్, ప్రసాద్, శివకృష్ణ, సాంబ, సాయి, పవన్, శివ, అశోక్, సుమన్‌తో పాటు మరికొంత మంది బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్నారన్నారు. అర్హులందరికీ సంక్షేమ ఫలా లు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ పెండ్యాల జ్యోతి, క్లస్టర్ ఇన్చార్జిలు కే కుమారస్వామి, పద్మనాభరెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీజీఆర్పల్లిలో..
మండలంలోని జీజీఆర్పల్లిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 కుటుంబాలు ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్ష్యంలో బీఆర్ఎస్లో చేరారు. గ్రామానికి చెందిన ఇంజపల్లి సంపత్, పాణి, నాగరాజు, రవి, రాజు, సదయ్య, కుమారస్వామి, ప్రవీణ్, సతీశ్, నర్సయ్య, ఎంబాడి సంపత్, నరేశ్, అనిల్, కోటి, సుమలత, సునీతతో పాటు మరికొంత మంది నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తుత్తూరు కోమలారమేశ్, ఎంపీటీసీ బండారు శ్రీలత, మోటూరి రవి, పురాని రవీందర్, సాంబయ్య, కుమరస్వామి తదితరులున్నారు.
సీఎం కేసీర్ నాయకత్వంలోనేరాష్ట్రం అభివృద్ధి..
చెన్నారావుపేట : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పాత ముగ్ధుంపురం గ్రామానికి చెందిన 15 కాంగ్రెస్ కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి, నామాల సత్యనారాయణ, యువ నాయకులు కంది కృష్ణచైతన్యరెడ్డి, సర్పంచ్ లావణ్యాసాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు బషీర్, కార్యదర్శి పీ రమేశ్, మల్లయ్య, నర్సయ్య, యాకూబ్, జంపయ్య పాల్గొన్నారు.
సాయిరెడ్డిపల్లి కాంగ్రెస్ నాయలు చేరిక ..
నెక్కొండ : మండలంలోని కాంగ్రెస్ పార్టీ నా యకులు ఆదివారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌కు చెం దిన కట్టా నర్సింహారావు, బీ సంపత్, బానోత్ కోటేశంకు ఎమ్మెల్యే గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు.