గిర్మాజీపేట/కరీమాబాద్: తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్‌కు పలు సంఘాలు ఆదివారం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఖిలావరంగల్‌కు చెందిన ముదిరాజ్ కుల సంఘం, విశ్వకర్మ సంఘం నాయకులు, యువ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్, పండ్ల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు వేర్వేరుగా శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లారు. అనంతరం ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రతులను నరేందర్‌కు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో మద్దతు ఇస్తున్న కుల సంఘాలు, యూనియన్ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని, కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బైరబోయిన ఉమా దామోదర్, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు బోళ్ల కుమారస్వామి, కన్వీనర్ భిక్షపతి, ప్రధాన కార్యదర్శి దేవ శ్రీనివాస్, కోశాధికారి బయ్యా చిన్నయాదగిరి, విశ్వకర్మ సంఘం పెద్దలు చిట్టిమల్ల రాంభద్రయ్య, కాసుల ప్రతాప్, ఆటో యూనియన్ అధ్యక్షుడు పోలెపాక జడ్సన్, ఉపాధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి అనిల్, కోశాధికారి వినోద్, హమాలీ సంఘం గౌరవాధ్యక్షుడు మర్రి శ్రీనివాస్, అధ్యక్షుడు టీ రాజయ్య, సభ్యులు కందుల సదయ్య, చెక్క ప్రభాకర్, రాజేశ్వరరావు, సత్యం, మోర్తాల మల్లారి పాల్గొన్నారు. అలాగే, కరీమాబాద్‌లో తూర్పు నియోజకవర్గ కుల బంధువుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ మున్నూరుకాపు బిడ్డగా కులబాంధువులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు.
పోచమ్మమైదాన్/గిర్మాజీపేట/వరంగల్: కొత్తవాడలో అమరవీరుల త్యాగాలకు గుర్తుగా స్తూపాన్ని ఏర్పాటు చేసుకున్నామని నన్నపునేని నరేందర్ అన్నారు. 23వ డివిజన్లో శనివారం రాత్రి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు, నాయకులు తరలివచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అలాగే, పోతరాజుల విన్యాసాలు, ఆడబిడ్డల బతుకమ్మలు, బోనాలు, కోలాటాల నడుమ నరేందర్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ, నాయకులు నీలం రాజ్‌కిశోర్, బొల్లు సతీశ్, చిప్ప వెంకటేశ్వర్లు, బేతి అశోక్, యెలుగం శ్రీనివాస్, దామెర సర్వేశ్, గుడిబోయిన మణి-గోపాల్‌రావు, కిశోర్, అరుణ్, ఫక్రోద్దీన్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఆదివారం హంటర్‌రోడ్‌లోని గోల్డెన్ అండ్ డైమండ్ ఫంక్షన్ హాల్లో వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా నన్నపునేని ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు అండగా ఉంటానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోమారు ఆశీర్వదించాలని కోరారు.కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాసవీ క్లబ్ ప్రెసిడెంట్ పాలకుర్తి గాయత్రి, జిల్లా గవర్నర్ రవ్వ గీత, డైరెక్టర్ దాచేపల్లి సీతారాం, వైస్ ప్రెసిడెంట్ గార్లపాటి శ్రీనివాస్, అడిషనల్ సెక్రటరీ దొడ్డా మోహన్‌రావు, మంచాల విజయ్‌కుమార్, ఆర్యవైశ్య మిత్ర బృందం అధ్యక్షుడు దుబ్బ శ్రీనివాస్, సభ్యులు పాల్గొన్నారు. అలాగే, నన్నపునేనికి రాజస్తాన్ మార్వాడీ సమాజ్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆదివారం భద్రకాళీ ఆలయం సమీపంలో కీర్తి గార్డెన్లో కార్పొరేటర్ సురేశ్‌జోషి ఆధ్వర్యంలో జరిగిన దివాలి స్నేహ్ మిలాన్ కార్యక్రమానికి నరేందర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. మార్వాడీ సమాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు.