బచ్చన్నపేట, సెప్టెంబర్ 03 : బచ్చన్నపేట ఎంపీడీఓగా మమత బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఇన్చార్జి ఎంపీడీవోగా పనిచేసిన మల్లికార్జున్ ఇక్కడే ఎంపీవోగా కొనసాగనున్నారు. మమత మేడ్చల్ జిల్లా శామీర్ పేటలో ఎంపీడీఓగా పని చేసి బదిలీపై వచ్చి రెగ్యులర్ ఎంపీడీఓగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మండల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి అందించాలని సూచించారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలన్నారు. మండల స్థాయి అధికారులు అందరం కలిసి సమన్వయంతో పని చేసి జిల్లాలో ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా పంచాయతీ కార్యదర్శులు కొత్తగా వచ్చిన ఎంపీడీఓ ని కలిసి స్వాగతం పలికారు. అనంతరం మొక్క అందించి శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీవో మల్లికార్జున్. సూసరింటెండెంట్ శ్రీనాధ్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ పంకజ, సెక్రటరలు రేవతి గౌడ్, అనిల్ రాజ్, రూప, రూబీనా, కవిత, సౌజన్య, దేవిప్రసాద్, శ్రీనివాస్ చారి. మధు, నరేష్, భాను, రాధాకృష్ణ, రాజ శేఖర్, రమేష్ రెడ్డి, కర్ణాకర్, ప్రశాంత్ ఆచార్య, సతీష్ రెడ్డి, నర్సింహా చారి, తదితరులు పాల్గొన్నారు.