గూడూరు ఫిబ్రవరి 5: మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం వట్టి వాగు సమ్మక్క సారలమ్మ మినీ జాతర సందర్భంగా అమ్మవార్ల గద్దెల ప్రాంతంలో బుధవారం మండమెలిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతర ప్రారంభానికి ముందు గద్దెల వద్ద వట్టి గడ్డితో గద్దెలను శుద్ధి చేసి పసుపు కుంకుమలను గద్దెల వద్ద అలంకరించి మండమెలిగే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
ఈనెల 12 నుంచి మినీ జాతర ప్రారంభం కానుండగా, 13న గుడి మెలిగే కార్యక్రమం, 14న అమ్మ వార్ల గద్దల వద్ద భక్తులు పూజలు చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారని, 14న జాతర ముగుస్తుందని జాతర కమిటీ నిర్వాహకులు వెనుక నాగయ్య ప్రధాన పూజారి దారం సిద్దు తెలిపారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తహసిల్దార్ శ్వేత, డిప్యూటీ తహసీల్దార్ కోమల, జాతర కమిటీ బాధ్యులు పాల్గొన్నారు