గూడూరు : ఉపాధ్యాయుల చేతిలో విద్యార్థుల ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని మహబూబాబాద్ జిల్లా సెక్టోరియల్ (క్వాలిటీ విద్యా) అధికారి మహాంకాళి బుచ్చయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి హాజరై మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా సామార్థ్యాలను గుర్తించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు. విద్యార్థులలో వివిధ రకాలైన భిన్నమైన సామార్థ్యాలు ఉంటాయ ని వాటిని ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక బద్ధంగా వెలికి తీయాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పొండెం కాంతారావు, మహబూబ్ ఆలీ, పెనుక ప్రభాకర్, దేవేందర్రాజు, బత్తుల శ్రీనివాస్, సురేష్, ఉపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు.