న్యూఢిల్లీ : పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే ప్రాంతంలో భారత నౌకలు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు నిర్ధారించారు. ఇవి రెండు లక్షల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), 16.7 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ అయిల్ను తీసుకుని వస్తున్నాయన్నారు. నౌకా, రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించే ఈ ప్రాంతంలో మొత్తం 22 నౌకలు ఉన్నాయన్నారు. వీటిలో ఒక ట్యాం కర్ ఎల్ఎన్జీ, నాలుగు ముడి చమురు, ఆరు ఎల్పీజీని సరఫరా చేస్తున్నాయన్నారు.
న్యూఢిల్లీ : చైనాకు వెళ్తున్న ఏడు చమురు ట్యాంకర్లు మధ్యలోనే దిశ మార్చుకుని భారత్ వైపు పయనమైనట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. రష్యన్ చమురుపై విధించిన ఆంక్షలను అమెరికా తాత్కాలికంగా రద్దు చేయడంతో భారత్‌కు ఈ వెసులుబాటు లభించింది. చైనాకు పయనమైన ఏడు చమురు ట్యాంకర్లు మధ్యలోనే దారి మార్చుకుని భారత్‌వైపు మరలినట్లు నౌకల ట్రాకింగ్ సంస్థ వోర్టెక్సా లిమిటెడ్ పేర్కొన్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ఈ ఏడు ట్యాంకర్లలో మీడియం సైజు ముడి చమురు ట్యాంకర్ అక్వా టైటాన్ శనివారం మంగళూరు కొత్త పోర్టుకు చేరుకోనున్నది.