ఒకప్పుడు తెలుగులో ఓ వెలుగువెలిగిన కన్నడ భామ పూజాహెగ్డే గత ఐదేళ్లుగా రేసులో పూర్తిగా వెనకబడింది. టాలీవుడ్లో పూర్వ వైభవం కోసం ఎదురుచూస్తున్న ఈ సొగసరికి ప్రస్తుతం పరిస్థితులు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. తెలుగులో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఆమె ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా వుండగా ఈ భామ తెలుగులో మరో బంపరాఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది.
శర్వానంద్ కథానాయకుడిగా సీనియర్ దర్శకుడు శ్రీను వైట్ల ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘జార్జ్‌క్రిష్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో పూజాహెగ్డే కథానాయికగా నటించనుందని సమాచారం. కథానుగుణంగా ఇద్దరు నాయికలకు చోటుందని, ఇప్పటికే రుక్మిణి వసంత్ పేరును ఖరారు చేయగా, మరో కథానాయికగా పూజాహెగ్డే వైపు చిత్రబృందం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుంది.