వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ కమిషనరేట్‌కు చోటు
కరోనా కట్టడి కోసం చేసిన కృషికి గుర్తింపు
హన్మకొండ సిటీ, జూన్13 : కరోనా వైరస్ కట్టడికి వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న చర్యలకు గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటుదక్కింది. పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో బెస్ట్ పోలీసింగ్‌కు ఎంపికైంది. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ ఆఫ్ కమిట్మెంట్ పత్రం అందుకోనున్నారు. కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకనుగుణంగా సేఫ్టీ మేజర్స్ తీసుకున్నందుకుగాను వరంగల్ కమిషనరేట్‌ను ఎంపిక చేసినట్లు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హెడ్ ఆఫ్ యూరప్ విల్బెమ్ జెజ్లర్ పేరుతో ఆదివారం కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందింది.