కొత్తగూడ : నిరుపేదలకు సీఎం సహాయనిధి భరోసా కలిగిస్తుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం కొత్తగూడ మండలంలోని ఎదుళ్లపల్లి గ్రామానికి చెందిన రామయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, కాంగ్రెస్ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి చల్లా నారాయణరెడ్డి, జడ్పీటీసీ పులుసం పుష్పలత శ్రీనివాస్, ఎంపీపీ విజయరూప్సింగ్, మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.