మహబూబాబాద్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరతున్నారు. తాజాగా మహబూబాబాద్ పట్టణంలోని 6 వ వార్డుకు సుమారు 200 మంది స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..టీఆర్ఎస్లో చేరిన ప్రతిక కార్యకర్తకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మార్నేని వెంకన్న, పట్టణ అధ్యక్షుడు గద్దె రవి, గోగుల రాజు, ఆవుల వెంకన్న, దార యాదగిరి, డౌలాగర్ శంకర్, బుజ్జి వెంకన్న, సలీం, ఖలీల్, ఇస్మాయిల్, శ్రీనివాస్, రాంజీ, సంతోష్, యశ్వంత్, భరత్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.