మరో విద్యార్థికి తీవ్ర గాయాలు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంపతుల రెండో కొడుకు వినయ్ ఇంటర్ చదివాడు. ఆర్మీ ఉద్యోగం కోసం నెల రోజులపాటు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు
ఛాతిలో బుల్లెట్ దిగి విలవిల
గాంధీ వైద్యశాలలో చికిత్స పొందుతున్న లక్కం వినయ్
బాధితుడిది గార్ల మండలం మద్దివంచ
గార్ల, జూన్ 17 : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివంచకు చెందిన లక్కం వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ లక్కం వెంకన్న, సుభద్ర దంపతుల రెండో కొడుకు వినయ్ ఇంటర్ చదివాడు. ఆర్మీ ఉద్యోగం కోసం నెల రోజులపాటు హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నాడు.
పోలీసులు కాల్పులు జరపడంతో వినయ్ ఛాతిలో బుల్లెట్ దిగింది. దీంతో అతడిని హైదరాబాద్‌లోని గాంధీ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినయ్‌కి తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ హుటాహుటిన గాంధీ వైద్యశాలకు వెళ్లారు. కాగా అక్కడి వైద్యులతో ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ ఫోన్లో మాట్లాడారు. వినయ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పగా కోలుకునేదాకా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- bullet
- Injured
- mahabubabad
- Railway
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

