హనుమకొండ, జూలై 2 : డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకే ఇవాలని భద్రకాళి చెరువు పూడికతీత పనుల అవినీతిపై విచారణ చేపట్టాలని శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మె ల్సీ సిరికొండ మధుసూదనాచారి కోరారు. బుధవారం సాయంత్రం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, అంబేద్కర్‌నగర్, జితేందర్సింగ్నగర్వాసులతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్‌ను కలిసి డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు, భద్రకాళీ చెరువు పూడికతీత పనుల్లో అవినీతిపై విచారణ చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.
అనంతరం కలెక్టరేట్లో దాస్యంతో కలిసి మీడియాతో మధుసూదనాచారి మాట్లాడారు. గత ప్రభుత్వం హనుమకొండలోని అంబేద్కర్‌నగర్, జితేందర్సింగ్నగర్ ప్రాంతాల్లో ఏళ్లుగా గుడిసెల్లో నివసిస్తున్న వారికి డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లను కట్టిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఏండ్లుగా ఇక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించి అకడ డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు చేపట్టిన నేపథ్యంలో వారికే తప్పకుండా కేటాయించాలని ఇవ్వాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశామని చెప్పారు. పంపిణీ ఆలస్యమైనా ప్రభు త్వం మారినా లబ్ధిదారులకు అన్యాయం చేయవద్దని సూచించినట్లు పేర్కొన్నారు.
ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హుల సంఖ్య పెరిగిన క్రమంలో వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని అలాగే నాలాల వైండింగ్‌లో ఇల్లు కోల్పోయిన వారికి కూడా ఇళ్లు కేటాయించాలన్నారు. అర్హులకు ఇంకా ఇల్లు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి ఇవ్వాలని సూచించారు. అలాగే భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అవినీతి విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని మధుసూదనాచారి తెలిపారు. కాంట్రాక్ట్ పనుల కేటాయింపుల్లో సైతం నిబంధనల ఉల్లంఘన జరిగిందని వివరించినట్లు చెప్పారు. పూడికతీత కారణంగా ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకోవాలని కోరామని తెలిపారు.
భద్రకాళి చెరువు పనుల్లో పారదర్శకత లోపించిందని, జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. భద్రకాళి చెరువు పూడికతీత, సుందరీకరణ రెండు పూర్తిస్థాయిలో జరగలేదని, ఇందుకోసం కేటాయించిన కోట్లాది నిధులు దుర్వినియోగం అవుతున్నాయని విచారణ చేపట్టాలని కోరినట్లు ఎమ్మెల్సీ పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సోదా కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, నాయకులు జానకీరాములు, ముర్తజా, వినీల్‌రావు, శ్రీధర్, విద్యార్థి నాయకులు రాకేశ్ యాదవ్, వీరస్వామి, శ్రీకాంత్‌చారి, ఎర్ర చంద్రమౌళి, సౌరం రఘు, రమేశ్, సాయికుమార్, రూప పాల్గొన్నారు.