న్యూశాయంపేట, సెప్టెంబర్ 22: రాష్ట్రంలోని ముదిరాజులు రాజకీయాలకతీతంగా ఉద్యమిస్తేనే రిజర్వేషన్, హక్కుల సాధన సాధ్యమని మెపా మెపా (ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ తెలంగాణ ) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్తో సోమవారం ఆయన నివాసం హనుమకొండ హంటర్‌రోడ్డులో రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి సమావేశమయ్యారు.
ముదిరాజ్ బిడ్డలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలని దేవేందర్ అన్నారు. డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ఈ సందర్భంగా అభినందించారు. ముదిరాజులు ఏ పార్టీలో ఉన్నా క్యాడర్ల కాకుండా లీడర్‌గా ఎదగాలని అభిప్రాయపడ్డారు. అనంతరం మెపా రాష్ర్ట ఉపాధ్యక్షుడు పొన్నం రాజు ముదిరాజ్, రాష్ర్ట సలహదారులు పులి ప్రభాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ వెనుకబడిన ముదిరాజ్ బిడ్డలకు మెపా ఎల్లపుడు సహకారం అందిస్తుందనీ,ప్రతి ముదిరాజ్ బిడ్డ మెపాలో భాగస్వామ్యం కావడానికి ముందుకు వస్తున్నారన్నారు.
కార్యక్రమంలో ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్అసోసియేషన్ రాష్ర్ట కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్, మెపా గౌరవ సలహాదారులు పులి ప్రభాకర్ ముదిరాజ్, రాష్ర్ట ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్, హనుమకొండ జిల్లా అధ్యక్షులు పులి రాజేష్, ఉపాధ్యక్షులు గోనెల విజేందర్, హనుమకొండ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు గోనెల సాగర్,పులి మహేష్ ముదిరాజ్ ,బోడ రంజిత్ ముదిరాజ్, కొక్కు రమేశ్ ముదిరాజ్, బొల్లి భాస్కర్ ముదిరాజ్ పాల్గొన్నారు.