వరంగల్, జూలై 14 : బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శుక్రవారం గ్రేటర్ 48వ డివిజన్‌కు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు హరిశంకర్, శంకర్‌లతో పాటు 130 మంది గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వారికి విప్ వినయ్‌భాస్కర్ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి, ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.
48వ డివిజన్లో రూ.వందల కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం రూ.65 కోట్లతో ఆర్వోబీ నిర్మాణం చేపడుతున్నామని ఆయన తెలిపారు. దీంతో డివిజన్ ప్రజల కష్టాలు తీరుతాయని అన్నారు. డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఈ చేరికలు దోహదపడుతాయని అన్నారు. పాత, కొత్త నాయకులను సమన్వయం చేసుకొని డివిజన్‌ను అభివృద్ధిలో ముందుకు తీసుకపోతామని చీఫ్‌విప్ తెలిపారు. పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని ఆయన సూచించారు.