జనగామ చౌరస్తా, అక్టోబర్ 28 : జనగామ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ బ్రదర్స్ బట్టల దుకాణం వ్యాపారి స్వర్గం శ్రీనివాస్ తండ్రి లక్ష్మీనారాయణ (77) గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. ఆదివారం షార్ట్ సర్క్యూట్తో జరిగిన అగ్ని ప్రమాదంలో వారి బట్టల దుకాణం పూర్తిగా కాలిబూడిదైంది.
ఈ ప్రమాదంలో తన చిన్న కుమారుడు శ్రీనివాస్ జీవనోపాధి దెబ్బతిని కుటుంబం రోడ్డుమీద పడడం, రూ.70 లక్ష ల వరకు ఆస్తి నష్టం వాటిల్లడంతో ఆవేదనకు గురైన లక్ష్మీనారాయణ గుండెపోటుకు గురైనట్లు బంధుమిత్రులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అతడి ఇంటికి చేరుకొని లక్ష్మీనారాయణ మృతదేహంపై పూలమాల వేసినివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు.