హనుమకొండ చౌరస్తా, నవంబర్ 28 : పరిశోధనల్లో విద్యార్థులు రాణించాలని, పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి పొందిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కేయూ వీసీ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ స్వర్ణోత్సవాల సందర్భంగా వచ్చే నెల డిసెంబర్ 9, 10 తేదీలలో డీన్, స్టూడెంట్స్ఎఫైర్స్ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే నోబెల్ ప్రైజ్ డే సెలబ్రేషన్స్బ్రోచర్ను వీసీ ఛాంబర్లో వీసీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ మామిడాల ఇస్తారి, విద్యార్థి కన్వీనర్లయిన వికాస్, శ్రేయ, హరితలతో కలిసి ఆవిష్కరించారు.
విద్యార్థులలో పరిశోధన, సైన్సు సబ్జెక్టు పట్ల అభిరుచి కలవడానికి నోబుల్ ప్రైజ్ డే ఉత్సవాలు ఉపయోగపడతాయని వీసీ అన్నారు. కార్యక్రమం నిర్వహణ కోసం వివిధ విభాగాల నుంచి విద్యార్థులతో నిర్వహణ కమిటీ వేసినట్లు, ఈ కార్యక్రమ నిర్వహణలో విద్యార్థి కమిటీ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ వెల్ఫేర్ ఆఫీసర్లు రాధిక, నిరంజన్ విద్యార్థులు పాల్గొన్నారు.