హనుమకొండ రస్తా, ఆగస్టు 5: పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకమే మార్గమని కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూ అవెన్యూ ప్లాంటేషన్, జాతీయ సేవా పథకం సంయుక్త ఆధ్వర్యంలో ఆడిటోరియం ప్రాంగణంలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం రక్షణ మొక్కలపై ఆధారపడి ఉంటుందన్నారు.
మొక్కలు మన భావితరాలకు అత్యవసరమని, విద్యార్థులు, సిబ్బంది, వాలంటీర్లను పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం మాట్లాడుతూ పొగడ, అల్ల నేరేడు, చిందుగా, టెర్మినేలియా లాంటి 350 మొక్కలు నాటినట్లు తెలిపారు. జాతీయ సేవా పథకం కో-ఆర్డినేటర్ ఈసం నారాయణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు టి.వెంకటేష్, కుమారస్వామి, టి.రాధిక, సుజాత, సౌజన్య, శైలజ, రత్నమాల, ఆర్.ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.