హనుమకొండ, జూలై 7: తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల సందర్భంగా కాంస్ సర్కా రు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కేయూ విద్యార్థి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సమస్యల పరిషారం కోసం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఆహ్వానం మేరకు మంగళవారం హైదరాబాద్లోని అమరవీరుల స్మారక కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేయూ జేఏసీ వ్యవస్థాపక కో-కన్వీనర్, ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థి జేఏసీ చైర్మన్ జోరిక రమేశ్ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్ని కల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు.
వచ్చే ఆగస్టు15 స్వాతంత్య్ర దినోత్సవం నాటికి ఈ హామీల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో ఎకువ శాతం ఉద్యమ కేసులు ఎత్తివేసినప్పటికీ, సాంకేతిక కారణాలతో ఇంకా మూడు కేసులు పెండింగ్లో ఉండడంతో ఉద్యమకారులు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నా రు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పాస్ పోర్టులు మంజూరు కావడం లేదని, పెండింగ్లో ఉన్న ఉద్యమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. పైలట్ ప్రాజెక్టు కింద కాకతీ య విశ్వవిద్యాలయాన్ని ఎంపిక చేసి అకడి ఉద్యమకారులకు ముందుగా హామీలను అమలు చేయాలని సూచించారు.
గత ప్రభుత్వంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన ఉద్యమకారులకు ఎంపీ, ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి పదవుల్లో అవకాశాలు కల్పించారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇవ్వ డం లేదని విమర్శించారు. అనంతరం ఉద్యమకారుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరామ్, అద్దంకి దయాకర్లకు అందజేశారు. సమావేశంలో కేయూ జేఏసీ నాయకులు సాదు రాజేశ్, బొల్లికొండ వీరేందర్, చిర్ర రాజు, శరత్చంద్ర, కంజర్ల మనోజ్, బైరపాక ప్రశాంత్, కిషోర్, రంజిత్, రాజేందర్, మధు, రమాకాంత్ రెడ్డి, ఫిరోజ్, దామోదర్, సారయ్య, అనిల్, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.