హనుమకొండ, సెప్టెంబర్ 17: ప్రజాస్వామ్యాన్ని పటిష్టంగా నిలిపే బాధ్యత మనందరిదని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వల్లూరి రాంచంద్రం అన్నారు. విశ్వవిద్యాలయ పరిపాలన భవన ప్రాంగణంలో ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ సందర్భంగా కేయూలో జాతీయజెండాను ఎగురవేసి ఉద్యోగులు, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణ ప్రజల రాజకీయ, సాంస్కృతిక చైతన్యానికి నాంది పలికిన రోజు అని గుర్తుచేశారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆచార్య బి.సురేష్‌లాల్, కె.అనితారెడ్డి, ప్రిన్సిపాళ్లు ప్రొఫెసర్ టి.మనోహర్, ఆచార్య ఎస్.నరసింహచారితో పాటు పి.మల్లారెడ్డి, ఈసం నారాయణ, ఎన్.వాసుదేవరెడ్డి, ఎం.ఇస్తారి, ఎల్.పి.రాజ్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఎల్.రాము, సహాయ రిజిస్ట్రార్ సీహెచ్.ప్రణయ్‌కుమార్, పాల్గొన్నారు.