హనుమకొండ, అక్టోబర్ 21: హసన్‌పర్తి కిట్స్కాలేజీలో ఇటీవల నిర్వహించిన కాకతీయ యూనివర్సిటీ పురుషులు ఇంటర్ కాలేజీయేట్ టోర్నమెంట్ పోటీల్లో కేయూ కో-ఎడ్యుకేషన్ కాలేజీ విద్యార్థులు సత్తా చాటారు. కేయూ ఇంజినీరింగ్ విద్యార్థులు బి.చందన్, ధరావత్ రాజేశ్వర్, ఎనగందుల రవికిరణ్ జట్టు టేబుల్ టెన్నిస్‌లో అత్యుత్తమ ప్రతిభచూపి వర్సిటీ స్థాయిలో రన్నర్‌గా నిలిచారు.
జట్టు సభ్యులను ప్రిన్సిపాల్ డాక్టర్ రమణ, సూపరింటెండెంట్ బొల్నెపాక ప్రభాకర్, పీడీ శ్రీధర్‌రెడ్డి మంగళవారం కాలేజీలో ట్రోఫీని అందచేసి అభినందలు తెలిపారు. కేయూ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని 36 జట్టు టెన్నిస్ పోటీపడగా కేయూ కో-ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ విద్యార్థులు రన్నర్‌గా నిలిచారని ప్రిన్సిపాల్ రమణ తెలిపారు.