హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 3 : కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్ నెట్ వర్కింగ్ వ్యవస్థను ఆధునికీకరించి, మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేయూ బీఎస్ఎన్ఎల్కు వర్క్‌ఆర్డర్‌ను జారీ చేసినట్లు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ నుంచి జనరల్ మేనేజర్ అరవింద్‌కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.కిషన్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సురేష్, రజనికర్రెడ్డి, డివిజనల్ ఇంజనీర్లతో పాటు విశ్వవిద్యాలయ తరఫున రూసా నోడల్ అధికారి ఆర్.మల్లికార్జునరెడ్డి, అభివృద్ధి అధికారి ఎన్.వాసుదేవరెడ్డి, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి బి.రమ, క్యాంపస్ నెట్వర్కింగ్ సంచాలకులు డి.రమేష్ పాల్గొన్నారు.
వారి సమక్షంలో వర్క్ఆర్డర్కు సంబంధించిన విధులు, విధానాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం హాజరయ్యారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయ కే-హబ్‌లో స్టార్ట్ అప్స్,అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, క్యాంపస్‌లో ఇంటర్నెట్ సదుపాయాలను మరింత మెరుగుపరచడం, రూసా అనుమతి పొందిన, సాంక్షన్ అయిన ప్రాజెక్టులకు, అలాగే ఇంజనీరింగ్ కళాశాలలో కొనసాగుతున్న రీసెర్చ్ ప్రాజెక్టులకు అవసరమైన నెట్వర్క్మద్దతును విస్తరించడం లక్ష్యంగా ఈ వర్క్ఆర్డర్ జారీ చేసినట్లు తెలిపారు. క్యాంపస్ నెట్వర్కింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసి, సామర్థ్యాన్ని పెంపొందించడానికి బీఎస్ఎన్ఎల్ సహకారంతో రూ.1.29 కోటి వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు.