KU Degree Exams | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 22 : హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2025-26 విద్యాసంవత్సరం ప్రథమ సంవత్సరంలో బీఏ, బీకాం, బీఎస్సీ చదువుతున్న విద్యార్థుల మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ఈనెల 24 నుంచి డిసెంబర్ 10 వరకు నిర్వహించనున్నట్లు, పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని, విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్ వెంట తీసుకొని, పరీక్ష సమయానికి ముందుగానే కాలేజీకి చేరుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఏ విధమైన అక్రమాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు, విద్యార్థులందరూ పరీక్షలను క్రమశిక్షణతో, నిబంధనలు పాటిస్తూ శాంతియుత వాతావరణంలో రాయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.