హనుమకొండ, సెప్టెంబర్ 20: అతి త్వర లో వరంగల్‌లో పర్యటిస్తానని, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ ఇంట్లో పార్టీ జిల్లా అధ్యక్షు డు దాస్యం వినయ్ భాస్కర్, కుడా మాజీ చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్‌రావుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లో ఎండగడుదామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు కోసం పోరాడుదామన్నారు. రైతు రుణ మాఫీ, రైతు బంధు పూర్తిస్థాయిలో అమలు చేసే వరకు కలిసి కట్టుగా రైతుల పక్షాన నిలవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసే వరకు కొట్లాడుదామన్నారు.