మహబూబాబాద్ రూరల్, మే 26 : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ఆమె ఇటీవల యశోదలో శస్త్ర చికిత్స చేయించుకోగా కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా సత్యవతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.