హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 9 : బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్‌భాస్కర్‌కు కేసులు, ఉద్యమాలు కొత్త కావని, ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) అన్నారు. వినయ్‌భాస్కర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ లీగల్ సెల్ హనుమకొం డ, వరంగల్ జిల్లా బాధ్యులతో కలిసి సోమవారం కేటీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇటీవల పశ్చి మ నియోజకవర్గ పరిధిలో యూరియా, కాళేశ్వరం పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలు, 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం హనుమకొండ చౌరస్తాలో నిర్వహించిన ధర్నా నేపథ్యంలో పోలీసులు తప్పు డు కేసులు నమోదు చేశారని లీగల్ సెల్ బృందం ఈ సందర్భంగా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లింది. వారి తో కేటీఆర్ మాట్లాడుతూ న్యాయస్థానాల్లో గులాబీ శ్రేణుల పక్షాన బీఆర్ఎస్ లీగల్ సెల్ పోరాడుతుందన్నారు.
అక్రమ కేసులకు భయపడబోమని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు బనాయించినా ప్రజలకు అండగా ఉంటామని, వారి హకుల సాధనకు నినదిస్తామని పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లా లీగల్ సెల్ సైతం అద్భుతంగా పనిచేస్తున్నదన్నారు. కేటీఆర్‌ను కలిసిన వారి లో వినయ్‌తో పాటు లీగల్ సెల్ బాధ్యులు తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, వినోద్‌కుమార్ ఉన్నారు.