హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్ఎస్ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమమ్యారు.
శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున-లింగయ్య, మాహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి, వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, కౌన్సిలర్ ఎండీ ఫరీద్‌కు కేటీఆర్ శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఐదేళ్ల పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రంలోని బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్లతో పాటు వైస్ చైర్మన్లను రామన్న అభినందించారు.
– జనగామ చౌరస్తా/మహబూబాబాద్ రూరల్