నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 24 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరా మారావు బర్త్ డే సందర్భంగా శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి స్వీట్లు పంచారు. దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీతోపాటు రక్తదానం చేశారు. హనుమకొండలోని 10వ డివిజన్ మచిలీ బజార్లో బీఆర్ఎస్ పార్టీ పశ్చిమ నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ పులి రజినీ కాంత్ ఆధ్వర్యంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మున్సిపల్ కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

అలాగే ఫాతిమానగర్‌లోని హౌస్ ఆఫ్ జాయ్ మానసిక దివ్యాంగుల కేంద్రంలో పండ్లు, బిస్కెట్లు, బ్రెడ్స్, కేక్‌లను పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గబ్బెట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్(జీజీహెచ్) వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి కార్యకర్తలు, ప్రజలకు పంచి పెట్టారు. అనంతరం పార్టీ నాయకులు రక్తదానం చేశారు.