కరీమాబాద్ జూలై 3 : ఈనెల 6న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీమాబాద్‌లో కురుమ కులస్తులు చేపట్టనున్న బీరన్న బోనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు కల్పించాలనిఆలయ కమిటీ అధ్యక్షులు కోరె కృష్ణ కురుమ కోరారు. గురువారం కృష్ణ ఆధ్వర్యంలో మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బందోబస్తు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కోరె కృష్ణ మాట్లాడుతూ ఈనెల 6న ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పట్టు వస్త్రాలు, తీయ జెండాను చేతబూని పురవీధుల గుండా తిరుగుతూ ఆలయానికి చేరుకొని ఆలయంలోని చెట్టుపై జాతీయ జెండాను కడతామన్నారు.
మధ్యాహ్నం బీరన్నల విన్యాసాలతో బోనాలు సాగుతాయన్నారు. బోనాలన్నీ కరీమాబాదులోని బురుజు సెంటర్లోకి రాగానే గావుపట్టే కార్యక్రమం ఉంటుందన్నారు. గావును తిలకించేందుకు వందలాదిమంది ప్రజలు అక్కడకు వస్తారని, కావున బందోబస్తు కల్పించాలన్నాఉ.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లం పద్మ, మరుపల్ల రవి, ఉపాధ్యక్షులు కడారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి మురికి రాజు, సహాయ కార్యదర్శి దయ్యాల సుధాకర్, కోశాధికారి నరిగే లక్ష్మణ్, కు దయ్యాల పురుషోత్తం, మండల రాజు, కంకల మల్లేశం మండల కొమురెల్లి కోర కుమారస్వామి, బండారి రాజేశ్వర్, నంద నవీన్, గొట్టే సదానందం, గొట్టే మల్లేశం, కార్యవర్గ సభ్యులు కంచ తిరుపతి, వాసవి, శ్రీనివాస్, ఎమ్మే వేణు, కోరే రమేష్ , శ్రీనివాస్, మురికి చిన్న రవి, కంచ మెట్టయ్య, కొమ్ము రాజు ,కాటన్ సతీష్, బండారి మల్లేశం పాల్గొన్నారు.