బచ్చన్నపేట ఆగస్టు 31 : బీసీలంత ఐక్యంగా కదిలి రావాలి అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. జనగామ నియోజకవర్గానికి చెందిన కొత్తపల్లి సతీష్ కుమార్ హైదరాబాద్‌లోని బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో తీన్మార్ మల్లన్నతో పాటు తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతును తెలిపారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..బీసీ రాజ్యం స్థాపన కోసం అందరూ ఏకతాటిపైకి వచ్చి కలిసి కట్టుగా శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. 2028లో జరగబోయే ఎన్నికల్లో బీసీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సతీష్ కుమార్ మాట్లాడుతూ మల్లన్న నాయకత్వంలో రాబోయే పార్టీలో తాను కూడా భాగస్వామ్యమై, కలిసి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ పొలిటికల్ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.