భీమదేవరపల్లి, జూలై 15: హనుమకొండ జిల్లాలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 5లక్షల 73వేల 374 వచ్చినట్లు ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం స్వామివారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. కరెన్సీ నోట్ల ద్వారా రూ. 5,23,860, కాయిన్స్ ద్వారా రూ.49514 మొత్తంగా రూ.5,73, 374.00 వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బందితో పాటు సిరిసిల్లకు చెందిన శ్రీ రాజ రాజేశ్వర సేవా సమితి సభ్యులు సేవలందించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సంజీవ రెడ్డి, స్థానిక నాయకులు పిడిశెట్టి కనకయ్య, పూదరి రవీందర్, సదానందం, యాటపోలు శ్రీనివాస్, ఆలయ ఉప ప్రధాన అర్చకులు రాజయ్య, అర్చకులు మొగిలిపాలెం రాంబాబు, శ్రీకాంత్, రమేష్, సందీప్, శివకుమార్, శరత్ చంద్ర, శ్రావణ్, సిబ్బంది రవీందర్, నారాయణరావు, శ్రీధర్, అనూష, రాజు, రాజేందర్, భక్తులు పాల్గొన్నారు.