జనగామ రూరల్, ఏప్రిల్ 14: అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్ధంకి గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన వడగండ్ల వానకు నేలమట్టమైన పంటపొలాలను పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ పరమైన సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
జిల్లా అధికార యంత్రాంగం జరిగిన నష్టంపై నివేదికలు సిద్ధం చేయాలన్నారు. సమస్యను జిల్లా ఇంచార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటామని రైతులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బనుక శివరాజు యాదవ్, పిఎసిఎస్ చైర్మన్ నిమ్మతి మహేందర్ రెడ్డి, నాయకులు సుంకరి శ్రీనివాస్ రెడ్డి, బండ్రు సిద్ధులు, బండ ప్రభాకర్, సంకటి యాదగిరి, అంబాల రఘునాథ్, డాక్టర్ రాజమౌళి, వంశీధర్ రెడ్డి, ఉమాపతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, భిక్షపతి, బాల మైసయ్య, శివ, ఉపేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.