ములుగు రూరల్, జూలై 5: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పి. శబరీశ్కు బీఆర్ఎస్ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కోగిల మహేశ్ శనివారం ఫిర్యాదు చేశారు. అశోక్ కొన్ని నెలలుగా పార్టీ సమావేశాలు, సోషల్ మీడియా గ్రూపుల్లో రెచ్చగొట్టేలా మాట్లాడడం, పోస్టులు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
కొన్ని నెలల క్రితం కుమ్మరి నాగేశ్వర్రావు మృతి, జర్నలిస్టు శ్రీకాంత్‌రెడ్డిపై దాడి, ఇటీవల చల్వాయికి చెందిన చల్లా రమేశ్ మృతికి గల కారణాలను ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపా రు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని సోషల్ మీడి యా వేదికగా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ తరిమికొడుతాం, అంతు చూస్తాం అంటూ బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈ నెల 7న ములుగు జిల్లాకేంద్రంలో తలపెట్టిన శాంతియుత నిరసనకు పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు. ఆయన వెంట నాయకులు బొమ్మినేని సురేశ్‌రెడ్డి, చిగురు దేవేందర్ తదితరులు ఉన్నారు.