కాశిబుగ్గ మే 15: జనాభా ప్రకారం ఆదివాసి ఎరుకల సామాజిక వర్గానికి చెందిన వారు రాజకీయంగా, ఉద్యోగ పరంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు. వారిపై ప్రేమతో నాంచారమ్మ జాతరకు వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వాక్యాలు చేసిన కాంగ్రెస్ నేతలు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు.
వరంగల్ నగరంలోని 14 డివిజన్ ఎస్ఆర్ నగర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ములుగు జిల్లాలోని వెంకటపురం మండలం రామాంజపురంలో జరిగిన ఎరుకల ఆరాధ్య దైవమైన నాంచారమ్మ జాతరకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చిన విషయం తెలిసిందే. కాగా, కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు.
వెంటనే కవితకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కావాలనే ఎరుకల జాతిని కించపరిచేలా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మానుపాటి రమేష్, ఓని సదానందం, లోకిని సమ్మయ్య, పులిషేరు సురేష్, బిజిలి ప్రశాంత్, కేతిరి సంతోష్ కుమార్, భూనాద్రి రంజిత్, మానుపాడు గణేష్, సాంబశివుడు, భిక్షపతి పాల్గొన్నారు.