వరంగల్, ఆగస్టు 15 : ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గురువారం పోచంపల్లి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
అలాగే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పోచంపల్లి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. పోచంపల్లికి కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.