కాజీపేట, జనవరి 22 : ప్రయాణికులకు ప్రపం చ స్థాయి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో రాష్ట్రంలోనే రెండో అతి పెద్దది, ఉత్తర, దక్షిణ భారతానికి ముఖద్వారంగా ఉన్న కాజీపేట రైల్వేస్టేషన్ సరికొ త్త హంగులు అద్దుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వం అమృత భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్)లో కాజీపేట్ రైల్వేస్టేషన్ ఎంపిక చేసి 2024లోనే రూ.24.45 కోట్లు కేటాయించగా, పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, ఏబీఎస్ఎస్ కింద తెలంగాణలో మొత్తం 40 స్టేషన్లు ఎంపికైనట్టు పేర్కొన్నారు.
కాజీపేట రైల్వేస్టేషన్‌ను 1888లో నిజాం గ్యారెంటీడ్ స్టేట్ రైల్వే నిర్మాణం చేపట్టింది. ఈ స్టేషన్ సికింద్రాబాద్-ఢిల్లీ రైలు మార్గంలో నిర్మించబడింది. కాజీపేట రైల్వే సబ్ డివిజన్ ప్రాంతంలో బొగ్గు, పత్తి, గ్రానై ట్, సిమెంట్ తదితర వస్తువులు అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది. కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి నాలు గు రైళ్లు ప్రారంభం అవుతుండడంతో పాటు ప్రతిరోజు దాదాపు వం ద ప్రయాణికుల రై ళ్లు కాజీపేట- బలా ర్ష, కాజీపేట-విజ యవాడ, కాజీపేట – సికింద్రాబాద్ సెక్షన్లో రాకపోకలు సాగిస్తాయి. ఇప్పటి కే 40 శాతం పను లు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.