కాళేశ్వరం, జూలై 10 : కాళేశ్వరంలోని లక్ష్మీ(కన్నెపల్లి) పంప్‌హౌస్‌లో నీటి ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. సోమవారం ఏడు మోటర్ల ద్వారా ఇంజినీర్లు సరస్వతి(అన్నారం) బరాజ్‌కు 14,500 క్యూసెక్కుల నీటిని తరలించారు. 1, 3, 4, 5, 6, 7, 9వ మోటర్లు నిరంతరం నడుస్తూ డెలివరీ సిస్టర్న్ ద్వారా గ్రావిటీ కెనాల్లో ఎత్తిపోయడంతో సరస్వతి బరాజ్‌కు తరలుతున్నాయి.
లక్ష్మీ బరాజ్‌కు 24,800 క్యూసెక్కులు
మహదేవపూర్, జూలై 10 : లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌కు ప్రాణహిత నది నుంచి సోమవారం 24,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. బరాజ్ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 12.51 టీంసీల నీరు నిల్వ ఉన్నట్లు భారీ నీటిపారుదల శాఖ డీఈఈ సురేశ్ తెలిపారు. ప్రస్తుత నీటిమట్టం బరాజ్ రివర్బెడ్ నుంచి 10.8 మీటర్లుగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
సమ్మక్క బరాజ్ మూడు గేట్లు ఎత్తి నీటి విడుదల
కన్నాయిగూడెం : సమ్మక్కబరాజ్(తుపాకులగూడెం)కు వరద పెరుగుతోంది. ఎ గువ నుంచి 13,140 క్యూసెక్కులు వస్తుండడంతో సోమవారం మూడు గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం 80మీ టర్ల ఎత్తుకు చేరింది. దీంతో 80 మీటర్లకు దాటకుండా నీరు ఉండేలా గేట్లను ఆపరేట్ చేస్తున్నామన్నా రు. దేవాదుల ఎత్తిపోతల వద్ద ఒక మోటర్తో పంపింగ్ కొనసాగుతున్నది. సోమవారం ఫేస్-3 నుంచి మరో మోటర్ ఆన్ చేసి రెండు మోటర్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. ఫేస్-3లోని రెండు మోటర్ల ద్వారా రోజుకు 583 క్యూసెక్కుల నీటిని భీం ఘనపురం రిజర్వాయర్‌లోకి తరలిస్తున్నట్లు డీఈఈ శరత్, ఏఈఈ సాయిరాం తెలిపారు.