బచ్చన్నపేట మే 7 : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి అన్నారు. బుధవారం సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం పర్వతం నరసింహులు అధ్యక్షతన జరిగింది. ఈ కనకా రెడ్డి మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు.
పెట్రోల్, డీజిల్ అనేక నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పై పోరు తప్పదన్నారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక హామీలు ఇస్తూ ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ , మండల కమిటీ సభ్యులు మిన్నలాపురం ఎల్లయ్య, అన్నేబోయిన రాజు, బైరగోని బలరాములు, ఇంజ ఎల్లయ్య, గోల్కొండ ఈదమ్మ, తదితరులు పాల్గొన్నారు.