వైభవంగా ధ్వజారోహణం
భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు.
- వృషభ, మృగవాహనంపై భద్రకాళి అమ్మవారి ఊరేగింపు
- నేడు మకర, చంద్రప్రభ వాహనాలపై ఊరేగనున్న అమ్మవారు, అనంతరం ఎదురుకోలు
వరంగల్, ఏప్రిల్ 23: భద్రకాళి, భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. అమ్మవారికి పర్వతరాజకుమారి మహేశ్వరి అలంకరణలో ఉదయం వృషభ వాహనంపై, సాయంత్రం మృగవాహనంపై మాడవీధుల గుండా ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం అమ్మవారికి మకర వాహన సేవ, సాయంకాలం చంద్రప్రభ వాహన సేవల అనంతరం ఎదురుకోలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అలాగే కల్యాణం జరిగే దేవతా విగ్రహాల కోసం భూదాన్ పోచంపల్లి నుంచి చేనేత కళాకారులు తెచ్చిన పట్టువస్ర్తాలను ఈఓ శేషుభారతికి అప్పగించారు. మంగళవారం సాయంత్రం జరిగే కల్యాణ క్రతువులో పాల్గొనాలనుకునే భక్తులు ప్రత్యేక కౌంటర్లో రూ.516 చెల్లించి రసీదు పొందాలని తెలిపారు. కల్యాణంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్ర్తాలు, ప్రసాదం అందిస్తామని అధికారులు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

