ఇవ్వాల్సింది లక్ష.. ఇస్తున్నది 35 వేలే!‘
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు.
- జీరో’ ఫీజుకు మంగళం!
- 10వేల లోపు ర్యాంకులకు పూర్తి ఫీజులివ్వని సర్కార్
- రెండేండ్లుగా ఇదే పరిస్థితి
- విద్యార్థుల తీవ్ర ఆవేదన
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమల్లో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఫలితంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. సర్కార్ జూనియర్ కాలేజీల్లో చదివి, ఎప్సెట్లో పదివేలలోపు ర్యాంకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల మొత్తం ఫీజు సర్కారే చెల్లించాల్సి ఉన్నది. కానీ రెండేండ్లుగా సర్కార్ అరకొరగా చెల్లిస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల ఫీజు రూ. లక్ష ఉండగా 2024-25, 2025-26లో కేవలం రూ. 35వేలు మాత్రమే జమ అయ్యాయి. దీంతో బీటెక్ మూడో సంవత్సరంలోని విద్యార్థులకు టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల గురించి అడిగితే కాంగ్రెస్ సర్కార్ అవి కేసీఆర్ బకాయిలంటూ బుకాయిస్తున్నది.
కానీ ఇప్పుడు బకాయి పడ్డవి కేసీఆర్వి కావు. 2024-25, 2025-26 విద్యాసంవత్సరాలకు సంబంధించినవి. అంటే కాంగ్రెస్ సర్కార్ చెల్లించాల్సినవే. పాత బకాయిలివ్వకుండా గోసపుచ్చుతున్న కాంగ్రెస్ సర్కార్.. తాము ఇవ్వాల్సినవి కూడా ఇవ్వడంలేదు. మొత్తం ఫీజు సర్కార్ భరిస్తుందన్న నమ్మకంతో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇప్పుడేం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. పూర్తి ఫీజు మంజూరుకాకపోవడంతో ఈ విషయంపై సర్కార్కు లేఖ రాయాలని స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం కోరింది. విద్యార్థుల పూర్తి ఫీజులను చెల్లించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు ఫోరం నాయకులు రాహుల్ నాయక్, దుర్గాప్రసాద్, ఆదిత్య, అక్షిత, హేమంత్, ఆనంద్, రామకృష్ణ, సాయితేజ తదితరులు శుక్రవారం జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జయలక్ష్మిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
సగం కూడా ఇవ్వట్లే..
- జీ జశ్వంత్రెడ్డి అనే విద్యార్థి 2024 ఎప్సెట్లో 1,747 ర్యాంకు సాధించాడు. జేఎన్టీయూ కాలేజీలో బీటెక్ కోర్సులో చేరాడు. ఫీజు రూ. లక్ష ఉండగా 2024-25 విద్యాసంవత్సరంలో రూ. 35 వేలు మాత్రమే మంజూరయ్యింది.
- టీ చంద్రమోహన్గౌడ్కు 1,905 ర్యాంకు వచ్చింది. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ రావాల్సి ఉన్నది. 2024-25లో రూ. 35వేలు, 2025-26లో రూ. 35వేలు మాత్రమే మంజూరయ్యాయి.
- తాటిపల్లి వివేక్కుమార్కు 2,486 ర్యాంకు రాగా, రూ. లక్ష ఫీజుకు రూ. 35వేలు మాత్రమే మంజూరయ్యింది.
ఎంట్రెన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించామని, సర్కార్ ఫీజు చెల్లిస్తుందన్న భరోసాతో కాలేజీల్లో చేరామని విద్యార్థులు చెప్తున్నారు. పూర్తి ఫీజు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. సర్కార్ వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Prevention | క్యాన్సర్ నివారణ అంటే పొగ తాగడం, మద్యం మానేయడం కాదు.. వీటిని కూడా పాటించాలి..
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

