హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : కర్ణాటకలో బంగారం, రాగి అన్వేషణ దిశలో సింగరేణి సంస్థ మరో ముందడుగు వేసింది. అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీశాఖతో ఒప్పందం కుదుర్చుకున్నది. ఈమేరకు ఇరు సంస్థల అధికారులు శుక్రవారం ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కర్ణాటక రాయచూరు, యాదగిరి జిల్లాల్లో విస్తరించి ఉన్న దేవదుర్గ బ్లాక్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు సింగరేణి సంస్థ గతంలో లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. 199.13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఈ బ్లాక్లో ఐదేండ్లల్లో అన్వేషణ పూర్తిచేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది.