న్యూఢిల్లీ, ఆగస్టు 7: భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ).. ఫార్చ్యూన్ బ్రాండ్‌లో వంటనూనెలను తయారు చేస్తున్న అహ్మదాబాద్‌కు చెందిన ఏడబ్ల్యూఎల్ అగ్రీ బిజినెస్ లిమిటెడ్ సంస్థపై జరిమానా వేసింది. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా సన్‌ఫ్లవర్ కుకింగ్ ఆయిల్‌ను తయారు చేయడం లేదని మంగళూర్ విభాగంపై ఫైన్ విధించింది. గోవాలోని తాజ్ ఫోర్ట్ అగోడా రిసార్ట్ అండ్ స్పా నుంచి సేకరించిన ఫార్చ్యూన్ ‘ఫ్రైయోలా’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ సీడ్ ఆయిల్ (1 లీటర్) నమూనాలలో పేర్కొన్న పరిమితి కంటే చాలా తక్కువగా విటమిన్ ఏ, డీ స్థాయిలు ఉన్నట్టు తమ ల్యాబ్ పరీక్షల్లో తేలినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ శుక్రవారం తెలిపింది.