Kaloji Kalakshetram | హనుమకొండ చౌరస్తా, మే 30: చేయూత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హనుమకొండ కాళోజీ కళాక్షేత్రం శనివారం కాకతీయ కళామహోత్సవం నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, ఫిల్మ్ డైరెక్టర్ డి.లక్ష్మీనర్సింహారావు తెలిపారు. శుక్రవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
శనివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు జరిగే కాకతీయ కళామహోత్సవంలో శాస్త్రీయ జానపద కళాప్రదర్శనలు, కాకతీయ కళా అవార్డు ప్రదానం, ఇండియన్ కల్చరల్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో కళాకారులు అలరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కళారత్న డాక్టర్ వేదాంతం రాధేశ్యామ్, బాబలి యాక్టర్ ఆశ్రిత వేముగంటి నండూరి, ప్రొడ్యూసర్ డాక్టర్ డీఎస్ రావు పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో సినిమాటోగ్రాఫర్ ఆనమ్ వెంకట్, రోజా క్రియేషన్స్ డైరెక్టర్ ఆలేటి శ్యామ్, యాక్టర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.