జనగామ రూరల్, ఏప్రిల్25 : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని జనగామ మాజీ ఎంపీపీ మేకల కళింగ రాజు యాదవ్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెద్దపహాడ్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. అలవికాని హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు మేలు జరుగుతుందన్నారు. ఈ నెల 27న జరిగే రజతోత్సవ సభను భారీ ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ్లపల్లి రవి, మండల ప్రధాన కార్యదర్శి నిమ్మల స్వామి, మాజీ ఎంపీటీసీ రాజగోపాల్, సురేందర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, సారయ్య, బండి సిద్ధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.