T Hub | హనుమకొండ చౌరస్తా, జులై 28: కాకతీయ విశ్వవిద్యాలయ కే-హబ్ అభివృద్ధి దిశగా ముందడుగులో భాగంగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి, రుసా నోడల్ ఆఫీసర్ ఆర్.మల్లికార్జునరెడ్డి, కే-హబ్ డైరెక్టర్ టి.సవితాజ్యోత్స్న, ఇతర అధికారులు హైదరాబాద్‌లోని టి-హబ్ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా టి-హబ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ తాలూక్ తదితరులతో సమావేశమై, కాకతీయ విశ్వవిద్యాలయం కే-బ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అవసరమైన చర్యలపై విస్తృతంగా చర్చించారు. రెండవ శ్రేణి నగరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌లో స్టార్టప్‌ల స్థాపన, ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థలపై సమాలోచనలు జరిగాయని, టి-హబ్‌లో అందుబాటులో ఉన్న ఆధునిక మౌలిక సదుపాయాలను పరిశీలించి, అలాంటి మౌలిక వసతులను కే-హబ్ లో ఎలా రూపొందించవచ్చో విశ్లేషించారు. అదేవిధంగా, టి-హబ్ నమూనాను అనుసరిస్తూ ఇంటీరియర్ డిజైన్, వసతుల రూపకల్పన కోసం ఆర్కిటెక్ట్ తో ప్రత్యేకంగా చర్చించారు. స్టార్టప్‌ల స్థాపనకు విద్యార్థులలో అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో టి-హబ్ చేపట్టిన శిక్షణ కార్యక్రమాల మాదిరిగా కేయూలోనూ ప్రాథమిక శిక్షణలు అందించే అవకాశాలపై చర్చించి సమాచారాన్ని సేకరించారు.